Ad Code

ఐటెల్ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ !

ఐటెల్ ఎస్ 23 పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్ మన దేశంలో 16జీబీ ర్యామ్ తో వస్తున్న మొట్ట మొదటిది కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్లో అమ్మకానికి ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,799గా ఉంది. కంపెనీ ఈ ఫోన్ కి వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఫోన్ కొన్న రోజు నుంచి 100 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఐటెల్ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఇది వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫోన్ పై భాగంలో చేంజింగ్ కలర్స్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ఆక్టా కోర్ యూనిసోక్ టీ606 12ఎన్ఎం చిప్ సెట్ ఉంటుంది. దీనిలో 8జీబీ ర్యామ్ అలాగే మరో 8జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. అంటే మొత్తం 16జీబీ ర్యామ్ సైజ్ అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ సామర్థ్యం వచ్చేసరికి 128జీబీ వరకూ ఉంటుంది. అలాగే 1టీబీ వరకూ ఎక్స్ పాండబుల్ మెమరీ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15 గంటల రన్నింగ్ టైం ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. హెచ్డీఆర్, సూపర్ నైట్ మోడ్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఆవిష్కరణ పై ఐటెల్ ఇండియా సీఈఓ అరిజిత్ తలపాత్ర మాట్లాడుతూ , "నేడు వినియోగదారులు చాలా ఆప్రమప్తతతో ఉన్నారు. వారి ఇష్టాలు, ఎంపికలు, ఫ్యాషన్ అంశాల పరంగా తమకు కావాల్సినవి డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల అవసరాలు కూడా మారిపోయాయి. మొబైల్‌లు ఇకపై కేవలం పరికరాలు మాత్రమే కాదు. వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ఐటెల్‌ ఎస్ 23లో మేము అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్ లో తీసుకొచ్చాం. ఇది వినియోగదారులకు ఉత్తమ అనుభూతిని ఇస్తుంది' అని అన్నారు. offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu