బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, వారి ఫోన్‌లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. https://t.me/offerbazaramzon
0 Comments