బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా, MG డెవలపర్ ప్రోగ్రామ్, (MGDP 4.0)లో తుది విజేతలను ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన రెండు స్టార్ట్అప్ సంస్థలు అద్భుతమైన ఐడియాలతో విజేతలుగా నిలిచాయి. అందులో ఒకటి సెంటార్ ఆటోమోటివ్ కాగా, మరొకటి ఆంప్లిఫై క్లీన్‌టెక్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచింది. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్నోవేట్ ఫర్ ఇండియా’ అనే థీమ్‌తో స్టార్ట్అప్స్, డెవలపర్లు, ఇన్నోవేటర్ల కోసం మెరుగైన ఇన్నోవేషన్ వేదికను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ MGDP 4.0 కార్యక్రమంలో పాల్గొనేవారు విద్యార్థులు, ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు 250కి పైగా ఎంట్రీలను స్వీకరించారు. అందులో 88 ఎంట్రీలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. మే 17 నుంచి మే 18 తేదీల్లో జరిగిన వర్చువల్ జ్యూరీ రౌండ్‌లకు ఎంపిక అయిన టాప్ 14 జట్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ జట్లలో 6గురు విజేతలుగా నిలిచారు. ఇందులో, హైదరాబాద్ చెందిన రెండు స్టార్ట్అప్‌లతో పాటు, బెంగళూరు, గుర్గావ్, ముంబైకి చెందిన 4 స్టార్టప్ సంస్థలు ఉన్నాయి. ఎంజి మోటర్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ఎంజీ మోటార్ ఇండియా ఒక బ్రాండ్‌గా గ్రీన్ మొబిలిటీపై దృష్టి సారిస్తూ వచ్చింది. MGDP 4.0 బ్రాండుగా వినూత్న ఆలోచలనలను ప్రోత్సహిస్తాం. ఈ సీజన్లో పాల్గొన్న బృందాలలో 30శాతానికి పైగా ఉండగా.. వారిలో కనీసం ఒక మహిళా వ్యవస్థాపకులు ఉండటం చాలా సంతోషకరమైన విషయం' అని అన్నారు. స్టార్టప్ ఇండియా అధినేత ఆస్థా గ్రోవర్ మాట్లాడుతూ.. 'ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్ట్అప్ సంస్థలు తమ వినూత్నతను ప్రదర్శించడానికి సమస్యా పరిష్కారంలో కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఇలాంటి నిమగ్నతా కార్యక్రమాలు చాలా అవసరం. క్లీన్ ఎనర్జీ పట్ల నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌తో విద్యుత్ వాహనాలు ఈ రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అత్యాధునిక టెక్నాలజీలతో పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో స్టార్ట్అప్ సంస్థలు ముందవరుసలో నిలుస్తున్నాయి' అని పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
0 Comments