దేశీయ మార్కెట్లో KTM కంపెనీ సరికొత్త KTM 200 డ్యూక్ 2023ని లాంచ్ చేసింది. ఈ బైక్ ధర మార్కెట్లో రూ. 1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది. కేటీఎం మోటార్‌సైకిల్ LED హెడ్‌ల్యాంప్‌తో అప్‌గ్రేడ్ అయింది. స్టైలింగ్ పాపులర్ KTM 1290 సూపర్ డ్యూక్ R నుంచి ప్రేరణ పొందింది. ఈ లాంచ్‌తో, 200cc, అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన అన్ని KTM మోటార్‌సైకిళ్లు చుట్టూ LED లైటింగ్‌ను కలిగి ఉంటాయి. KTM 200 డ్యూక్ 2023 199.5cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC, FI ఇంజిన్‌ను కలిగి ఉంది. 25PS గరిష్ట శక్తిని, 19.2Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మోటార్‌సైకిల్ స్ప్లిట్-ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందు భాగంలో WP అపెక్స్ USD ఫోర్క్‌లను, వెనుకవైపు 10-దశల సర్దుబాటు చేయగల WP అపెక్స్ మోనోషాక్‌ను ఉపయోగిస్తుంది. ముందువైపు 300mm డిస్క్, వెనుకవైపు 230mm డిస్క్ ఉన్నాయి. సూపర్‌మోటో మోడ్‌తో డ్యూయల్-ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది. KTM 200 డ్యూక్ 2023 బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ సిల్వర్ మెటాలిక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ.. LED హెడ్‌ల్యాంప్ అప్‌గ్రేడ్ KTM 200 డ్యూక్‌ను మునుపటి కన్నా పదునుగా మరింత ప్రీమియంగా చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌తో (KTM 200 DUKE) భారత మార్కెట్లో మొదటిసారి పర్ఫార్మెన్స్ బైకింగ్ విభాగంలో వచ్చిన విప్లవాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. https://t.me/offerbazaramzon
0 Comments