బ్యాక్‌ టు యూనివర్సిటీ సేల్ ఆఫర్ కింద కేవలం విద్యార్థులకు మాత్రమే ఆపిల్‌ ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్లు వర్తించనుంది. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ఆపిల్‌ వెల్లడించింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు సరైన విద్యార్థి గుర్తింపు కార్డు ఉండాలని స్పష్టం చేసింది. ఇన్‌వాయిస్‌ విద్యార్థి పేరు మీదనే జారీచేస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా బ్యాక్‌ టు యూనివర్సిటి ఆఫర్‌ కింద ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌లు కొనుగోలు చేసుకోవచ్చని ఆపిల్‌ తెలిపింది. ఎంపిక చేసిన మ్యాక్‌బుక్‌లతో ఎయిర్‌పాడ్స్‌ మరియు ఐప్యాడ్‌లతో ఆపిల్‌ పెన్సిల్‌ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఆపిల్‌కేర్‌ ప్లస్‌ సర్వీసులపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌లు ఆపిల్ ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. (ఆపిల్‌ BKC మరియు ఆపిల్‌ సాకేత్‌). ఆపిల్ రీసెల్లర్‌ వద్ద కూడా ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. వారి వద్ద అదనంగా డిస్కౌంట్లు మరియు బ్యాంక్‌ ఆఫర్‌ పొందవచ్చని సూచించింది. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 13 M1 అసలు ధర రూ.99,900గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ. 89,900 కొనుగోలు చేయవచ్చు. ధర రూ.1,14,900గా ఉన్న ఎయిర్‌ 13 M2ను కేవలం రూ.1,04,900కే కొనుగోలు చేయొచ్చు. ఇటీవల లాంచ్ అయిన 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌ 15 M2 అసలు ధర రూ.1,34,900 కాగా కేవలం ధర రూ.1,24,900కే కొనుగోలు చేయవచ్చు. మ్యాక్‌బుక్ ప్రోను, 13 అంగుళాల మ్యాక్‌బుక్‌, 14 అంగుళాల, 16 అంగుళాల మోడళ్ల ప్రారంభ ధర రూ. 1,19,900, రూ.1,84,900, రూ.2,29,900గా ఉంది. బ్యాక్‌ టు యూనివర్సిటీ ఆఫర్‌ కింద ఈ మోడళ్ల మ్యా్క్‌బుక్‌లను కేవలం ప్రారంభ ధర రూ. 1,29,900, రూ. 1,99,900, రూ.2,49,900కే కొనుగోలు చేయవచ్చు. ఆపిల్‌ బ్యాక్‌ టు యూనివర్సిటీ ఆఫర్‌ కింద కేవలం మ్యాక్‌బుక్‌లే కాకుండా.. ఐమ్యాక్‌ను ధర రూ.1,24,900కే కొనుగోలు చేయవచ్చు. మ్యాక్‌ మినీపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. కేవలం ధర రూ. 49,900కే కొనుగోలు చేయవచ్చు. అయితే మ్యాక్‌ స్టూడియో, కొత్తగా విడుదలైన మ్యాక్‌ప్రో M2పై ఎటువంటి ఆఫర్‌లు అందుబాటులో లేవు. ఐప్యాడ్‌, ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో 11 మరియు ఐప్యాడ్‌ ప్రో 12.9లను వరుసగా రూ.54,000, రూ.76,900, రూ.1,02,900కే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐప్యాడ్‌ మోడళ్లు పెన్సిల్ ఉచితంగా రానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆపిల్‌ కోరింది. ఆపిల్‌ బ్యాక్‌ టు యూనివర్సిటీ ఆఫర్‌ కింద ఐఫోన్‌, ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు పొందలేరు. అయితే ఆపిల్‌ ఐఫోన్‌ 14 అసలు ధర రూ.79,900 కాగా ప్రస్తుతం రూ. 68,999కే సొంతం చేసుకోవచ్చని ఆపిల్‌ తెలిపింది. మరియు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వినియోగదారులు అదనంగా మరో 4000 రూపాయల తగ్గింపును పొందుతారని పేర్కొంది. https://t.me/offerbazaramzon

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ