Ad Code

మాల్వేర్‌తో ఆండ్రాయిడ్ డివైజ్‌ల టార్గెట్ !


సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌తో ఆండ్రాయిడ్ డివైజ్‌లను టార్గెట్ చేశారు. తాజా నివేదిక ప్రకారం, ఈ మాల్వేర్ చాట్‌జీపీటీ అనే పాపులర్ AI చాట్‌బాట్ అప్లికేషన్‌ ముసుగులో ఆండ్రాయిడ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫేక్ మాల్వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేస్తే, అంతే సంగతులని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ యూనిట్ 42 పరిశోధకుల ప్రకారం.. ఓపెన్ఏఐ GPT-3.5, GPT-4 విడుదల అయినప్పుడే, కొన్ని కొత్త రకాల మాల్వేర్ వేరియంట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ మాల్వేర్ వేరియంట్లు చాట్‌జీపీటీ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. పరిశోధకులు రెండు రకాల హానికరమైన సాఫ్ట్‌వేర్‌లను కనుగొన్నారు. వాటిలో మొదటిది "సూపర్‌జీపీటీ". ఇది హానిచేయని అప్లికేషన్‌గా నటిస్తుంది కానీ వాస్తవానికి ఇది మీటర్‌ప్రెటర్ ట్రోజన్ అని పిలిచే ఒక హానికరమైన ప్రోగ్రామ్. రెండవ రకం "ChatGPT" అనే యాప్. ఇది థాయిలాండ్‌లోని ఖరీదైన ఫోన్ నంబర్లకు రహస్యంగా మెసేజ్‌లను పంపుతుంది. ఫలితంగా యూజర్లకు ఛార్జీలు పెరుగుతాయి. ఈ రెండు ప్రోగ్రామ్‌లు ప్రమాదకరమైనవి, యూజర్‌లో కంప్యూటర్ లేదా మొబైల్ డివైజ్‌లకు హాని కలిగించవచ్చు. తాజా రిపోర్ట్ సురక్షితమైనదిగా కనిపించే మరో ఆండ్రాయిడ్ యాప్‌ నిజ స్వరూపాన్ని కూడా బయట పెట్టింది. చాట్‌జీపీటీ ఆధారిత ఒరిజినల్ AI అసిస్టెంట్ వెర్షన్ వలె నటించే ఆ హానికరమైన యాప్‌లో ట్రోజన్‌ను సైబర్ నేరగాళ్లు ప్రవేశపెట్టారని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్ల ఆండ్రాయిడ్ డివైజ్‌కు హ్యాకర్లు రిమోట్ లొకేషన్ నుంచి యాక్సెస్ పొందే ముప్పు ఎక్కువ. మారువేషంలో ఉన్న ఈ హానికరమైన యాప్‌ ఒక ట్రోజన్ అని, దీని పట్ల యూజర్లు జాగ్రత్త వహించాలని రిపోర్ట్ తెలిపింది. ట్రోజన్ అనేది డివైజ్‌లకు హాని కలిగించేటప్పుడు లేదా యూజర్ల సమాచారాన్ని దొంగిలించేటప్పుడు సురక్షితమైనదిగా కనిపిస్తూ ప్రజలను మోసగిస్తుంది. పరిశోధకులు APK మాల్వేర్ శాంపిల్స్ అనే హానికరమైన ఫైల్‌ల గ్రూప్‌ కూడా కనుగొన్నారు. ఈ ఫైల్‌లు AI టూల్ ChatGPT వెబ్‌పేజీ వలె నటిస్తాయి. అయితే, ఈ వెబ్‌పేజీలో మాల్వేర్ దాగి ఉంటుంది. ఈ మాల్వేర్ శాంపిల్స్ అన్నీ OpenAI లోగోను ఉపయోగిస్తాయి. ఇది చూసి అసలైన చాట్‌జీపీటీ అప్లికేషన్‌లు అని యూసర్లు నమ్మే ప్రమాదం ఎక్కువ. ఈ మాల్వేర్ శాంపిల్స్ సాధారణ నంబర్ల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేసే థాయ్‌లాండ్‌లోని ప్రత్యేక ఫోన్ నంబర్లకు SMS మెసేజ్‌లు పంపవచ్చు. ఈ ప్రత్యేక నంబర్లను సమాచారం లేదా కొన్ని రకాల సేవలను పొందడానికి యూజర్లు ఉంటారు. SMS వచ్చిన ప్రతీసారి వారి నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ ప్రీమియం-రేటు నంబర్‌ల వెనుక ఉన్న సంస్థ లేదా వ్యక్తి డబ్బును సేకరిస్తారు. అయితే నివేదికలో పేర్కొన్నట్లుగా స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాలకు ఇది లక్ష్యం కావచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu