Ad Code

నాన్-బ్లూ ట్విట్టర్ యూజర్లకు డైలీ డైరెక్ట్ మెసేజ్‌లపై కొత్తగా లిమిట్ ?


ట్విట్టర్ ఇటీవల పెయిడ్ సర్వీస్ ట్విట్టర్ బ్లూను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లో బ్లూ టిక్ వెరిఫికేషన్‌తో పాటు ఎడిట్ ఆప్షన్, తక్కువ యాడ్స్, లాంగర్‌ ట్వీట్స్, లాంగర్ వీడియో అప్‌లోడ్ సామర్థ్యం లాంటి ఎక్స్‌ట్రా ఫీచర్లను కూడా కంపెనీ ఆఫర్ చేసింది. అయితే ఇంతకుముందు ఫ్రీగా ఉన్న ఫీచర్లను కూడా ట్విట్టర్ బ్లూలో కంపెనీ కలిపేస్తోంది. తాజాగా నాన్-బ్లూ యూజర్లు డైరెక్ట్ మెసేజ్‌లు పంపించడంపై పరిమితులు తీసుకొస్తోంది. ట్విట్టర్ బ్లూ తీసుకోని యూజర్లు ఒక రోజులో పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యకు సంబంధించి కొత్త లిమిట్‌ను ప్రవేశపెట్టే పనిలో కంపెనీ ఉందని ఒక టెక్ లీక్‌స్టర్ పేర్కొన్నారు. "ట్విట్టర్ బ్లూకి సైన్-అప్ చేయని మీరు రోజుకు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి ట్విట్టర్ పని చేస్తోంది." అని అలెశాండ్రో పలుజ్జీ ట్వీట్ చేశారు. ఈ లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, డైరెక్ట్ మెసేజ్‌ల ఒక లిమిట్ చేరుకున్న తర్వాత, నాన్-ట్విట్టర్ బ్లూ యూజర్లు మరిన్ని డైరెక్ట్ మెసేజ్‌లు పంపించలేరు. ఒకవేళ పంపించాలనుకుంటే వెరిఫికేషన్ పొందాలి. అంటే ట్విట్టర్ బ్లూ కొనుగోలు చేయాలి. ప్రస్తుతం, ట్విట్టర్‌లో రోజుకు 500 డైరెక్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపేలా ఒక లిమిట్ ఉంది. అయితే, కొత్త పరిమితులు అమలులోకి వచ్చినప్పుడు, ఈ లిమిట్ మరింత తగ్గే అవకాశం ఉందని లీకర్ వెల్లడించారు. ఫలితంగా, ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రైబ్ కాని యూజర్లు వారు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై లిమిట్స్ ఎదుర్కోవచ్చు. అయితే కొత్త లిమిట్ వల్ల స్పామ్‌ మెసేజ్‌లు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ ఫీచర్ ఒకవైపు ప్రయోజనం చేకూరుస్తూనే మరోవైపు మైనస్ గా మారుతుంది. కాగా అధికారికంగా నాన్-బ్లూ సబ్‌స్క్రైబర్స్‌కి డైరెక్ట్ మెసేజ్‌ల పై తీసుకొస్తున్న కొత్త లిమిట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ప్లాట్‌ఫామ్‌లో ఈ వారంలో ఒక అప్‌డేట్ పరిచయం చేయబోతున్నట్లు ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. నిర్దిష్ట యూజర్లను ఫాలో కాని వారు వారికి డైరెక్ట్ మెసేజ్‌లు పంపే సామర్థ్యాన్ని పరిమితం చేయడమే ఈ అప్‌డేట్ లక్ష్యం. ఈ పరిమితి ట్విట్టర్ బ్లూ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ట్విట్టర్ క్రియేటర్స్‌ వారి రిప్లైలలో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ద్వారా డబ్బులు పొందవచ్చని మస్క్ గతంలో పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu