నోకియా 2600 ఫ్లిప్ మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది. నోకియా ఒరిజినల్ సిరీస్‌లో లాంఛ్ అయిన రెండో మొబైల్ ఇది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన సంగతి తెలిసిందే. స్మార్ట్ఫోన్లు పాపులర్ అయినప్పటి నుంచి నోకియా హవా తగ్గింది. కానీ నోకియా ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ యూజర్లు గతంలో తాము ఉపయోగించిన నోకియా ఫోన్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నోకియా 2600 ఫ్లిప్ ఇండియాలో లాంఛ్ కావడం విశేషం. నోకియా 2600 ఫ్లిప్ ఫోన్ ధర రూ.4,699. సేల్ మొదలైన కొన్ని రోజుల తర్వాత అమెజాన్‌లో స్టాక్ కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ S30+ ప్లాట్‌ఫామ్‌తో పనిచేస్తుంది. నోకియా 2600 ఫ్లిప్ ఫోన్లో ఇందులో 2.8 అంగుళాల QVGA ప్రైమరీ స్క్రీన్ ఉంటే, 1.77 అంగుళాల QQVGA సెకండరీ స్క్రీన్ కూడా ఉండటం విశేషం. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఎంపీ3 ప్లేయర్‌తో పాటు స్నేక్ గేమ్ సహా 8 గేమ్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి. నోకియా 2600 ఫ్లిప్ ఫోన్ Unisoc T107 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 48ఎంబీ ర్యామ్ + 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్డీ కార్డుతో 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 1450ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 6.3 గంటల టాక్‌టైమ్ లేదా 20.1 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. నోకియా 2600 ఫ్లిప్ ఫోన్లో మైక్రో యూఎస్బీ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో పోర్ట్, 4జీ, బ్లూటూత్ 4.2, వైర్లెస్ ఎఫ్ఎం రేడియో లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది. 5 కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు. బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్‌లో ఉన్నాయి. నోకియా 8210 4జీ మోడల్‌ను కూడా ఇండియాలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ధర రూ.3,999. క్యాండీ బార్ ఫార్మాట్లో ఈ ఫోన్ రిలీజైంది. ఇందులో డ్యూయెల్ సిమ్ స్లాట్స్, యూనిసోక్ టీ107 ప్రాసెసర్, S30+ ఆపరేటింగ్ సిస్టమ్, 48ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3.8 అంగుళాల QVGA డిస్ప్లే, 0.3మెగాపిక్సెల్ కెమెరా, 1,450ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
నోకియా క్లాసిక్ ఫోన్ సేల్ !
by Telugu Lo Computer at October 11, 2022
Labels:
amzon
,
science
,
technologe
,
ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది.
,
నోకియా క్లాసిక్ ఫోన్ సేల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment