బిలియనీర్ ఎలన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి కోరింది. స్టార్ లింక్ బ్రాండ్‌తో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు మస్క్ అనుమతి కోరినట్లు జాతీయ మీడియా తెలిపింది. స్పేస్ ఎక్స్ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న మూడవ కంపెనీ అని వివరించింది. ల్యాండింగ్ హక్కులు మరియు మార్కెట్ అర్హత పొందేందుకు ప్రభుత్వం నుండి చట్టబద్ధమైన అనుమతులను కూడా కోరిందని, టెలికమ్యూనికేషన్ విభాగం (డిఒటి) నుండి కూడా అనుమతులు పొందాల్సి ఉందని వెల్లడించింది. అయితే ఈ అంశంపై స్పేస్ ఎక్స్, డిఒటి స్పందించాల్సి వుంది. భారతి గ్రూప్‌కి చెందిన ఒన్ వెబ్, రిలయన్స్ జియోలు కూడా అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాయి.
0 Comments