జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇకపై స్కూటర్లలో ఎయిర్ బ్యాగులను తీసుకొని రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసిందట!. అయితే ఈ ఎయిర్ బ్యాగ్ లను స్కూటర్ మధ్యలో అమర్చవచ్చు. హ్యాండిల్ మధ్యలో ఉండటం వల్ల ఎయిర్ బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడ్ని సురక్షితంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ స్కూటర్ ఎయిర్ బ్యాగ్ కార్లలో ఉండే ఎయిర్‌బ్యాగ్‌ల లాగానే పని చేస్తుంది కానీ కార్లలోని సిస్టమ్‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇకపోతే ఎయిర్ బ్యాగ్ స్కూటర్ లు లాంచ్ ఎప్పుడు అన్న విషయాల విషయానికొస్తే. 2009 సంవత్సరంలో హోండా థాయ్‌లాండ్ అండ్ జపాన్‌లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. PCX అనే ఈ స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కంపెనీ మరోసారి ఎయిర్ బ్యాగ్‌లతో కూడిన కొత్త స్కూటర్‌ను అందించవచ్చట !.
0 Comments