ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ చైనాలో అక్టోబర్ 20వ తేదీన లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని అధికారిక టీజర్ ప్రకారం ఈ ఫోన్ ఆరెంజ్ కలర్లో కొనుగోలు చేయవచ్చు. దీని ముందు వెర్షన్ కూడా ఆరెంజ్ కలర్లోనే లాంచ్ అయింది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని తెలుస్తోంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ చార్జింగ్ అవుతుందన్న మాట. డివైస్ 3సీ లిస్టింగ్‌లో కూడా ఈ చార్జింగ్ కెపాసిటీతోనే లిస్ట్ అయింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే అందించనున్నారు. ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766వీ సెన్సార్ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించనున్నారు. ఐకూ నియో 6 మనదేశంలో రూ.29,999 ధరతో లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్లు చూస్తే... ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 193.95 గ్రాములుగా ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
20న ఐకూ నియో 7 విడుదల !
by Telugu Lo Computer at October 16, 2022
Labels:
20న ఐకూ నియో 7 విడుదల !
,
iqoo
,
science
,
smart phones
,
technologe
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment