అమాజ్ ఫిట్ కంపెనీ కొత్త అమాజ్ ఫిట్ ఫాల్కన్ స్మార్ట్‌వాచ్‌ని విడుదల చేసింది. 1.28 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 150 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లకు గొప్ప ఫిట్నెస్ ట్రాకర్ గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్-బ్యాండ్ జిపీఎస్ ర్యాకింగ్‌తో పాటు, హార్ట్ రేట్ , బ్లడ్ ఆక్సిజన్ మరియు ఒత్తిడి స్థాయిని పర్యవేక్షించడం కూడా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగివుంది. అమెరికా లో ఫాల్కన్ స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ వాచ్ USలో 499.99 డాల్లర్స్ (రూ. 41,208) ధరకు అందుబాటులో ఉంది. UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్ వంటి యూరోపియన్ ప్రాంతాలలో దీని ధర €499.99 (రూ.41,208) గా నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌ను ఇప్పుడు అమాజ్‌ఫిట్ స్టోర్‌లు మరియు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. బ్రెజిల్, మెక్సికో మరియు ఇతర దేశాల యూజర్స్ త్వరలో AliExpressలో కొనుగోలు చేయవచ్చు. Amazfit కంపెనీ ఇటీవల భారతదేశంలో కొత్త Amazfit GTR 4 మరియు GTS 4 లను పరిచయం చేసింది. ఇది డ్యూయల్-బ్యాండ్ సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నా టెక్నాలజీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు ఐదు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లను సపోర్ట్ చేస్తాయి. రియల్ టైమ్ GPS ట్రాకింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వీటిలో రన్నింగ్, స్లైడింగ్ సహా 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. 416 x 416 పిక్సెల్ స్క్రీన్ రెసల్యూషన్ సామర్థ్యం తో 1.28 అంగుళాల హెచ్‌డి అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లే 1,000 నిట్స్ బ్రెయిట్‌నెస్‌ని కలిగి ఉంది, అంతేకాకుండా, ఇందులో ఆల్వేస్ ఆన్ మోడ్ డిస్ప్లే ఉంది. ఇక ఈ స్మార్ట్‌వాచ్ టైటానియం యూనిబాడిని కలిగి ఉంది, 20ఎటిఎం వాటర్ ప్రూఫ్ ఏర్పాటు చేయబడింది. ఈ స్విమ్మింగ్ సమయంలో ఈ స్మార్ట్‌వాచ్‌ని ధరించడం సాధ్యం అవుతుంది. ఆల్‌వేస్ ఆన్ మోడ్‌ని కలిగి ఉంది. ఇది డ్యూయల్-బ్యాండ్ GPS ట్రాకింగ్ వ్యవస్థను కలిగి ఉంది, మీ కదలికను ట్రాక్ చేస్తుంది. అమాజ్‌ఫిట్ ఫాల్కన్ స్మార్ట్‌వాచ్ ద్వారా మీరు నిద్ర, హార్ట్ రేట్ , బ్లడ్ ఆక్సిజన్ మరియు ఒత్తిడి స్థాయిని పర్యవేక్షించ వచ్చు. ఇది 500mAh బాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇక ఈ స్మార్ట్ వాచ్ జాప్ కోచ్ అనే స్మార్ట్ ట్రైనింగ్, అల్గారిడమ్‌ని కలిగి ఉంది. Amazfit ప్రకారం, సాధారణ ఉపయోగంతో, 500 mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌పై 14 రోజుల వరకు ఉంటుంది. ఇది 150 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.
0 Comments