మేడ్ బై గూగుల్ లాంచ్ ఈవెంట్ లో గూగుల్ కంపెనీ పిక్సెల్ 7 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి స్మార్ట్ వాచ్ (పిక్సెల్ వాచ్)ను ఆవిష్కరించింది. ఇదే ఈవెంట్ లో గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఆవిష్కరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ, కంపెనీ ఈ ఫోల్డబుల్ హ్యాండ్సెట్ ను వచ్చే ఏడాది లాంచ్ చేయాలని నిర్ణయించింది. డిస్ ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ సీఈఓ రాస్ యంగ్ అభిప్రాయం ప్రకారం మొదటి పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ 2023 Q1 లో రావచ్చని తెలుస్తున్నది. పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ కు సంబంధించిన వివరాల గురించి అడుగుతూ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ చేసిన ట్వీట్ కు యంగ్ రిప్లై ఇచ్చారు. 2023 Q1లో కంపెనీకి సంబంధించిన తొలి ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ రావచ్చని వెల్లడించారు. జనవరిలో కంపెనీ ఈ హ్యాండ్సెట్ కోసం ప్యానెల్ షిప్మెంట్లను స్వీకరించడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. గూగుల్ రెండు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లపై పని చేస్తుందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. Googleకు సంబంధించిన ఆండ్రాయిడ్ 13 Quarterly Platform Release 1 (QPR1) బీటా నుంచి కోడ్ లైన్ లో 'ఫెలిక్స్' అనే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రస్తావనను డెవలపర్లు గుర్తించారు. ఈ ఫోల్డబుల్ హ్యాండ్సెట్ IMX787 ప్రైమరీ సెన్సార్, IMX386 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, S5K3J1 టెలిఫోటో లెన్స్ తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. దీని ఔటర్ డిస్ప్లే S5k3J1 టెలిఫోటో సెల్ఫీ కెమెరాను పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7.57-అంగుళాల ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.78-అంగుళాల అల్ట్రా-థిన్ గ్లాస్ కవర్ తో ఔటర్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, గూగుల్ నుండి 'పిపిట్' అనే కోడ్ నేమ్ తో ఫోల్డబుల్ ఫోన్ కూడా వచ్చింది. ఈ మోడల్ లో ఫీచర్ చేసిన టెన్సర్ SoC ఇప్పుడు పాతదిగా మారిందని డెవలపర్లు వెల్లడించారు. గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కు పిక్సెల్ ఫోల్డ్ లేదంటే పిక్సెల్ నోట్ ప్యాడ్ అని పేరు పెట్టవచ్చని తాజా నివేదిక వెల్లడించింది. ఇది చైనాలోని ఫాక్స్ కాన్ ద్వారా తయారు చేయబడుతుందని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈ ఏడాది మేలోనే జరగాల్సి ఉండగా ఆలస్యం అయినట్లు వివరించింది.
గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ ?
by Telugu Lo Computer at October 09, 2022
Labels:
2023 Q1 లో రావచ్చని తెలుస్తున్నది
,
google
,
science
,
smart phone
,
technologe
,
గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment