హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం విడుదల చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్‌లు ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్‌కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
0 Comments