ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మరిన్ని మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ పరిచయం చేసింది. ఈ అప్డేటెడ్ ఫీచర్లతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను చాలా సమర్థవంతంగా బ్లాక్ చేయవచ్చు. అలాగే బ్యాడ్ కామెంట్స్ బిల్డర్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ కొత్త సేఫ్టీ టూల్స్‌ల అప్డేట్స్ పరిచయం చేశారు. "ఈ రోజు మేం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటర్స్ & యూజర్లు సురక్షితంగా ఉండటానికి న్యూ నడ్జెస్, అప్డేటెడ్ బ్లాకింగ్, హిడెన్ వర్డ్స్ ఇంప్రూవ్మెంట్స్ అనే కొత్త మార్గాలను ప్రకటిస్తున్నాం" అని ఆడమ్ ఒక ట్వీట్ చేశారు. కామెంట్స్, డైరెక్ట్ మెసేజ్‌లలో బ్యాడ్ వర్డ్స్ పంపించకుండా ఓన్లీ రెస్పెక్టబుల్ వర్డ్స్ పంపేలా యూజర్లను ప్రోత్సహించడమే ఈ నడ్జెస్ ఫీచర్ ముఖ్య పని. ఒకవేళ యూజర్లు ఏదైనా బ్యాడ్ కామెంట్ చేయాలనుకున్నా లేదా అసభ్యకర మెసేజ్ పంపాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ వెంటనే వారిని నడ్జ్ చేస్తుంది. "హెల్ప్ కీప్ ఇన్స్టాగ్రామ్ ఏ సపోర్టివ్ ప్లేస్" అనే పాప్-అప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల మధ్య గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. నడ్జెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాధించే కామెంట్స్‌కి చాలావరకు కళ్లెం వేస్తాయి. ఒక పోస్ట్ కింద కామెంట్ సెక్షన్లో ఇడియట్, స్టుపిడ్ వంటి అనుచిత పదాలు ఉంటే.. మరొకరు అక్కడ మరింత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఒక రిమైండర్‌ను ఈ ఫీచర్ పంపిస్తుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ లాంగ్వేజ్ లో యాప్స్ వాడే యూజర్లకు ఈ నడ్జెస్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేస్తే వారు మళ్లీ ఆ యూజర్లను కాంటాక్ట్ అవ్వకుండా ఇన్స్టాగ్రామ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. ఈ కొత్త ఫీచర్‌తో, మీరు ఎవరినైనా బ్లాక్ చేసిన ప్రతిసారీ.. వారి బ్లాక్డ్ అకౌంట్‌తో పాటు వారికి సంబంధించిన మిగతా అకౌంట్స్ లేదా భవిష్యత్తులో క్రియేట్ చేసే ఇతర అకౌంట్స్ బ్లాక్ చేయడం సాధ్యమవుతుంది. ఇది కొత్త అకౌంట్స్ ఉపయోగించి వెంబడించడం/వేధించడం వంటి వాటికి చెక్ పెడుతుంది. హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన మెసేజ్‌లు కామెంట్స్ గుర్తించి వాటిని యూజర్లకు కనిపించకుండా దాచేస్తుంది. ఈ ఫీచర్ ఆన్ చేసిన యూజర్లకు కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్ నుంచి హానికరమైన కంటెంట్ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు క్రియేటర్ అకౌంట్స్‌కి హిడెన్ వర్డ్స్ డిటెక్షన్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. వారు తమకు కనిపించకూడదు లేదా దాచాలనుకునే ఎక్స్ట్రా పదాలు, పదబంధాలు, ఎమోజీలు ఒక కస్టమ్ వర్డ్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చూడకూడదనుకున్న కంటెంట్ మొత్తం హైడ్ అవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు !
by Telugu Lo Computer at October 21, 2022
Labels:
instagram
,
science
,
technologe
,
అప్డేటెడ్ బ్లాకింగ్
,
ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి
,
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు
,
న్యూ నడ్జెస్
,
హిడెన్ వర్డ్స్ ఇంప్రూవ్మెంట్స్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment