ఐక్యూ బడ్జెట్ ఫోన్లతో పాటు మిడ్‌రేంజ్ ఫోన్లను వరుసగా మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో మిడ్‌రేంజ్ ఫోన్‌ను చైనీస్ మార్కెట్‌లోకి అధికారికంగా రిలీజ్ చేసింది. ఐక్యూ నియో 7 పేరుతో తీసుకొచ్చిన ఈ డివైజ్‌లో లేటెస్ట్ చిప్‌సెట్‌తో పాటు, 120Hz AMOLED డిస్‌ప్లే, 120W ఛార్జింగ్ కెపాసిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoC, ఇండిపెండెంట్ ప్రో+ డిస్‌ప్లే చిప్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR5 RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో పాటు 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్, OTG వంటి కనెక్టివిటీ ఫీచర్లు దీని సొంతం. 50 MP సోనీ IMX766V సెన్సార్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8 MP అల్ట్రావైడ్ యూనిట్, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఐక్యూ నియో 7 డివైజ్ 20:8 యాస్పెక్ట్ రేషియో, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేసే 6.78 అంగుళాల FHD+ E5 AMOELD శామ్‌సంగ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ప్యానెల్ HDR10+, DCI-P3 కలర్ గామాట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ OriginOS Oceanతో రన్ అవుతుంది. చైనాలో లాంచ్ అయిన ఐక్యూ నియో 7 ఫోన్ వివిధ వేరియంట్లలో లభిస్తోంది. ఫోన్ బేస్ వేరియంట్ 8GB/128GB మోడల్ ధరను CNY 2,699గా (దాదాపు రూ. 31,000) నిర్ణయించింది. 8GB/256GB వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ. 32,150), 12GB/256GB వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ. 34,450), టాప్ ఎండ్ 12GB/512GB వేరియంట్ ధర CNY 3,299 (సుమారు రూ. 37,900)గా ఉంది. ఈ ఫోన్ జామెట్రిక్ బ్లాక్, ఇంప్రెషన్ బ్లూ, పాప్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనాలో ఐక్యూ నియో 7 ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
0 Comments