రూ.15 వేలకే జియో ల్యాప్‌టాప్


రిలయన్స్ జియో మరో సరికొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తేనున్నట్లు సమాచారం. రూ.15,000 ధరకే ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా 4జీ సిమ్ కార్డు ద్వారా నెట్‌వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. రిలయన్స్ సంస్థ తీసుకొచ్చిన తక్కువ ధర జియో ఫోన్ సక్సెస్ అయిన నేపథ్యంలో, అలాంటి ల్యాప్‌టాప్‌ను కూడా మార్కెట్లోకి తేవాలని రిలయన్స్ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి క్వాల్‌కామ్ సంస్థతోపాటు, మైక్రోసాఫ్ట్ సంస్థతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా చౌక ధరలోనే విండోస్ ఓఎస్ ఆధారిత ల్యాప్‌టాప్‌ను రూపొందిస్తోంది. పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా రిలయన్స్ ఈ ల్యాప్‌టాప్‌ తయారు చేస్తోంది. మరో మూడు నెలల్లోనే ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి రానుందని సమాచారం. 'జియో బుక్' పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ లాంఛ్ కానుంది. దీన్ని పూర్తిగా దేశంలోనే తయారు చేస్తున్నారు. కనీసం 15 శాతం మార్కెట్ లక్ష్యంగా రిలయన్స్ దీన్ని తీసుకొస్తోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org