Ad Code

టెస్లా నుంచి 'పై' స్మార్ట్‌ ఫోన్‌ ?


బార్ట్న్‌ హెయిర్‌ పేరుతో పెర్‌ఫ్యూమ్‌ రిలీజ్‌ చేసిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకీ అడుగు పెడుతున్నారు. టెస్లా 'పై' 5G ఫోన్‌ని పరిచయం చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందట!. ఆపిల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్‌ కోసం ఇన్నోవేటివ్‌ డిజైన్‌లను అందించిన నిపుణుడు 'ఆంటోనియో డి రోసా' టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేశారు. టెస్లా, స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌కు ‍ గుర్తు చేసేలా ఫోన్ ఉంటుందని డిజైనర్ చెబుతున్నారు. కొంతమంది టెక్నాలజీ బిజినెస్‌ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం... ఐఫోన్ 12 తరహాలో టెస్లా మోడల్ పై ఫోన్‌ ఉండవచ్చు. ఉదాహరణకు.. గుండ్రటి మూలలు, చతురస్రాకార ఫ్రేమ్‌లో నాలుగు కెమెరాలు, వెండి రంగులో ఉండవచ్చు. టెస్లా కార్ల లాగే టెస్లా ఫోన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో రాబోతోందట. 6.5 అంగుళాల స్క్రీన్, AMOLED డిస్‌ప్లే, 16 GB లేదా అంతకంటే ఎక్కువ RAM, 1-2 TB నిల్వ సామర్థ్యం సహా ప్రతి స్టాండర్డ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌తో ఇవి పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాటిలైట్ నుంచి నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇదే 'పై' ఫోన్‌ బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. ఒకవేళ మీరు అంగారక గ్రహంపైకి వెళ్తే, ఈ ఫోన్‌లోని స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా, భూమిపై ఉన్న వ్యక్తులకు ఫోన్ కాల్స్ కూడా చేయవచ్చట. మార్స్‌ మీద ఒక మానవ కాలనీ నిర్మించుకుంటే, వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడానికీ ఈ ఫోన్‌లోని కనెక్టింగ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందట. మీ మెదడుతో అనుసంధానించగలగడం టెస్లా పై ఫోన్‌లో ఉన్న మరో అద్భుత లక్షణం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో న్యూరాలింక్‌ని  చేరుస్తున్నారు. భారీ విక్రయాలను తీసుకొచ్చే మరో గొప్ప అంశం ఇది. Samsung, Apple ఫోన్లలో ఈ టెక్నాలజీ లేదు. ఆపిల్‌ వాచ్, iPad, MacBook సహా Apple అన్ని గాడ్జెట్‌లను iPhoneతో అనుసంధానించవచ్చు. టెస్లా పై ఫోన్‌కు కూడా ఇలాంటి సామర్థ్యం ఉందట. టెస్లా ప్రొడక్ట్స్‌ అన్నింటినీ పై ఫోన్‌కు అనుసంధానించవచ్చు. టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ను స్మార్ట్‌ఫోన్ నుంచి ఆపరేట్ (లాక్‌, అన్‌లాక్‌ సహా కొన్ని పనులు) చేయడానికి టెస్లా పై ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుమతిస్తుంది. టెస్లా పై ఫోన్‌లో మరో అత్యాధునిక ఫీచర్‌ ఇది. పై ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎండ ఉన్న ప్రాంతానికి వెళితే చాలు. కరెంటు కోసం ఎదురు చూడడం, ఛార్జింగ్ పోర్ట్‌ల వెతుక్కోవడం చేయాల్సిన అవసరమే ఉండదు. వినియోగదారులు పై స్మార్ట్‌ఫోన్‌ ద్వారా క్రిప్టో కరెన్సీ 'మార్స్‌కాయిన్‌'ను  మైనింగ్ చేయవచ్చట. ఫలితంగా, తమ ఫోన్లలోనే వర్చువల్ కరెన్సీని పొందుతారట !.


Post a Comment

0 Comments

Close Menu