సామ్సంగ్ తయారీ రంగంలో నుంచి తాజాగా ఫైనాన్సియల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్, వీసాతో కలిసి సామ్సంగ్ ఈ కార్డును తీసుకొస్తోంది. ఈ క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసే యూజర్లకు భారీ క్యాష్ బ్యాక్‌లు, ఆఫర్లను అందించనున్నట్లు సామ్సంగ్ తెలిపింది. ఈ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం 10 శాతం క్యాష్ బ్యాక్ అందించనుంది. ఈఎంఐ, నాన్ ఈఎంఐ ట్రాన్సక్షన్స్ అన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని సామ్సంగ్ తెలిపింది. అన్ని రకాల సామ్సంగ్ ప్రొడక్ట్స్‌తో పాటు ఇతర ప్రొడక్టలపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. సామ్సంగ్ క్రెడిట్ కార్డును వీసా సిగ్నేచర్, వీసా ఇనిఫినిటీ పేర్లతో విడుదల చేస్తోంది. వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై నెలవారీగా రూ.2,500తోపాటు ఏడాదిలో రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీసా ఇనిఫినిటీ కార్డుపై నెలవారీగా రూ.5000తో పాటు ఏడాదిలో రూ.20 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ కార్డులతో కొనుగోలు చేసే ప్రతీ దానిపై ఎడ్జ్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఇక వార్షిక ఫీజు విషయానికొస్తే సిగ్నేచ్ కార్డుకు రూ. 500, ఇనిఫినిటీ కార్డుకు రూ. 5000గా నిర్ణయించారు.
సామ్సంగ్ నుంచి క్రెడిట్ కార్డులు !
by Telugu Lo Computer at October 01, 2022
Labels:
business
,
samsung
,
science
,
technologe
,
ఫైనాన్సియల్ రంగంలోకి అడుగు
,
సామ్సంగ్ నుంచి క్రెడిట్ కార్డులు !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment