దేశీయ మార్కెట్లో ఒప్పో కొత్త బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ17కేను విడుదల చేసింది. 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా ఈ ఫోన్లో అందించారు. ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.10,499గా నిర్ణయించారు. నేవీ బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియా 88.7 శాతంగానూ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఏ17కేలో అందించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ17కే పని చేయనుంది. దీని బరువు 199 గ్రాములుగా ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వెనకవైపు కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 78 డిగ్రీలు కాగా, సెల్ఫీ కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 76.8 డిగ్రీలుగా ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, మైక్రో యూఎస్బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్లను కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దేశీయ మార్కెట్లో ఒప్పో ఏ17కే విడుదల !
by Telugu Lo Computer at October 20, 2022
Labels:
oppo
,
science
,
smart phone
,
technologe
,
దేశీయ మార్కెట్లో ఒప్పో ఏ17కే విడుదల !
,
ఫింగర్ ప్రింట్ సెన్సార్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment