చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు పంపిన చంద్రయాన్-2.. కీలక విషయాన్ని భూమిపైకి చేరవేసింది. చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్ ద్వారా ఈ సోడియం నిల్వలను గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1ఎక్స్‌ఎస్) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా చంద్రుడి చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2.. ఈ సోడియం మ్యాపింగ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. హైసెన్సిటివిటీ, సామర్ధ్యం కలిగిన క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్)ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారుచేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. లూనార్ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియంను ఈ క్లాస్ గుర్తించింది. చంద్రుడిపై ఉన్న వెదర్‌లో ఇలా సోడియం లభించడం ఆశక్తికర విషయమనే చెప్పొచ్చని 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్'లో ప్రచురితమైన ఆర్టికల్‌లో ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల వరకు సోడియం జాడలు కనిపించినట్లు ఇస్రో తెలిపింది.
0 Comments