ఎయిర్‌టెల్ ఫామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు


ఎయిర్‌టెల్ అనేక ప్రయోజనాలతో 4జి  ప్లాన్‌లను అందిస్తుంది. వాటిలో  మొదటిది ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ 399. ఇది  పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌. యూజర్లకు 200GB రోల్‌ఓవర్‌తో 40GB నెలవారీ డేటా, అపరిమిత లోకల్, STD రోమింగ్ కాల్‌లలు మరియు రోజుకు 100 SMS ఇస్తుంది.  ఈ ప్లాన్‌తో పాటు వినియోగదారులు 1 సాధారణ సిమ్‌ను మాత్రమే పొందుతారు. ఇది ఎయిర్‌టెల్ నుండి చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అయినప్పటికీ టెలికాం ప్లాన్‌తో కొన్ని ఎయిర్‌టెల్ థాంక్స్ రివార్డ్‌లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ యాప్ ప్రీమియం మరియు వింక్ అలాగే జగ్గర్‌నాట్ పుస్తకాలతో పాటు వినియోగదారులు షా అకాడమీకి ఒక సంవత్సరం యాక్సెస్‌ను పొందవచ్చు. ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ 499 ఇంకో ప్లాన్. ఇది బెస్ట్ సెల్లర్‌గా కూడా ఉంది. రూ.499 ధర ట్యాగ్‌తో ఎయిర్‌టెల్ లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్‌తో సహా అపరిమిత కాల్‌లతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్‌తో 75GB నెలవారీ డేటాను మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో 1 సాధారణ సిమ్‌ని పొందుతారు. ఇది ఒక ప్లాటినమ్ ప్యాక్ కాబట్టి వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినమ్ రివార్డ్‌లకు యాక్సెస్ పొందుతారు. ఇందులో అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అలాగే అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరానికి Disney+ Hotstar VIP మెంబర్‌షిప్ ఉంటుంది. ఇతర ప్రయోజనాలలో Airtel X-stream App ప్రీమియం, Wynk ప్రీమియం మరియు మరిన్ని ఉన్నాయి. మూడవది ఎయిర్‌టెల్ అందించే ఫ్యామిలీ ఇన్ఫినిటీ 999 ప్లాన్. రూ.999 ధరతో వినియోగదారులు అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్‌తో 150GB నెలవారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు కుటుంబ సభ్యుల కోసం 1 సాధారణ సిమ్ మరియు 2 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌లను పొందుతారు. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్‌లు ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ 499 లాగానే ఉంటాయి. జాబితాలో చివరిది ఫ్యామిలీ ఇన్ఫినిటీ ప్లాన్ 1599. ఎయిర్‌టెల్ రూ.1,599 ధర ట్యాగ్‌తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్‌తో 500GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 200 ISD నిమిషాలు మరియు IR ప్యాక్‌లపై 10% తగ్గింపును కూడా అందిస్తుంది. వినియోగదారులు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత 1 సాధారణ సిమ్‌తో పాటు కుటుంబ సభ్యుల కోసం 1 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌ని అందుకుంటారు. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్‌లు ఈ ప్లాన్‌తో కూడా పైన పేర్కొన్న విధంగానే ఉంటాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org