జపాన్ కార్ల దిగ్గజం టొయోటా మరో సరికొత్త కారును భారత మార్కెట్లోకి జనవరి 23న ప్రవేశపెట్టనుంది. విదేశాల్లో ఇప్పటికే ఆదరణ పొందిన తన Hilux పికప్ ట్రక్ ను భారత్ లో విడుదల చేయనుంది. Hilux పికప్ ట్రక్ లకు బుకింగ్ లు ప్రారంభించినట్లు టొయోటా సంస్థ తెలిపింది. భారత్ వినియోగదారుల మారుతున్న అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వాహనాలను తీసుకురావాలని భావిస్తున్న టొయోటా అందులో మొదట ప్రాధాన్యంగా ఈ Hilux పికప్ ట్రక్ ను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో సహా మధ్య ఆసియా దేశాల్లో ఇప్పటికే ఈ క్రమంలో భారత్ లోనూ ఈ వాహనానికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ స్టైల్ శ్రేణిలో వస్తున్న ఈ Hilux పికప్ ట్రక్ ప్రత్యేకతల గురించి బుధవారం నాడు సంస్థ వివరాలు వెల్లడించింది. ఇన్నోవా crysta, Fortuner ఉపయోగించిన IMV-2 ప్లాట్ఫారమ్ పైనే ఈ Hilux ట్రక్ ను అభివృద్ధి చేశారు. ఆల్ వీల్ డ్రైవ్ (AWD), LED హెడ్ లాంప్స్, 10.4 ఇంచ్ టచ్ స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
0 Comments