వివో ఇండియా రూ.20,000 లోపు సెగ్మెంట్లో వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.16,490. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ సేల్ కొనసాగుతోంది. మిడ్నైట్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వై21టీ స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత మొబైల్‌కు రూ.15,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే మీరు చెల్లించాల్సింది రూ.1,040 మాత్రమే. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తక్కువగా లభిస్తే ఇంకాస్త ఎక్కువ చెల్లించాలి. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్లో రిలీజ్ అయింది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో ర్యామ్‌ను 1జీబీ పెంచుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్ 1టీబీ పెంచుకోవచ్చు. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ !
by Telugu Lo Computer at January 22, 2022
Labels:
science
,
smart phone
,
technologe
,
ఫ్లిప్‌కార్ట్‌లో వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ సేల్
,
వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment