ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలన్ మస్క్ తన వ్యాపార పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత విమానాలు ఉపయోగిస్తుంటాడు. అయితే తన సెక్యూరిటీ దృష్ట్యా ఆ విమాన ప్రయాణ తాలూకు వివరాలు గోప్యంగా ఉంచుతాడు. ఈ నేపధ్యంలో మస్క్ తన విమానంలో ఏరోజు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయానికి చేరుకుంటున్నారు వంటి సంగతులన్నీ మీడియా వారికి చేరిపోతున్నాయి. దీంతో వారు ముందుగానే అక్కడికి చేరుకుని ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక విషయమై మస్క్ కార్యాలయం ఆరా తీయగా.. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. మస్క్ ప్రయాణ వివరాల కోసమే ఆ ట్విట్టర్ ఖాతా తెరిచాడు ఆ యువకుడు. దీంతో ఆ ట్విట్టర్ ఖాతాను తొలగించాలంటూ మస్క్ స్వయంగా స్వీనీకి విజ్ఞప్తి చేశాడట. దీనిపై యువకుడు స్వీనీ స్పందిస్తూ.. 'తొలగిస్తాను, కానీ అందుకు కొంత ఖర్చు అవుతుంది. కనీసం ఒక టెస్లా మోడల్ 3 కారు ఇవ్వాలి' అంటూ సరదాగా కోరాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'ఒక తుంటరి చేతిలో బలైపోవడం నాకు నచ్చలేదు, కానీ మీ ప్రతిభకు ఒక 5 వేల డాలర్లు (రూ.3,76,087) ఇవ్వగలను అంటూ సమాధానం ఇచ్చాడట. దీనిపై స్వీనీ స్పందిస్తూ 5 వేలు కాదుగానీ ఒక 50 వేల డాలర్లు ఇవ్వగలరా? నాకు చాలా అవసరం ఉంది. మంచి కాలజీకి వెళ్లి చదువుకోవాలి, అలాగే కారు కూడా కొనుక్కోవాలని ఉంది' అంటూ సమాధానం పంపాడట. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'ఆలోచిస్తానని' సమాధానం ఇచ్చాడట. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాలూకు వివరాలను మస్క్ కార్యాలయ ప్రతినిధి ఒకరు ఇటీవల బయటకు వెల్లడించారు. అయితే మస్క్ ఇంకా స్వీనీకి ఆ డబ్బు ఇచ్చాడా? లేదా? అనే విషయం తెలియరాలేదు గానీ విమాన వివరాలు తాలూకు ట్విట్టర్ ఖాతా అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.
0 Comments