ఇండియాలో 20221లో అధిక శాతం మంది ఆన్‌లైన్ గేమ్ లను ఆడడానికి ఇష్టపడ్డారు. అయితే అధికంగా గ్రాఫిక్స్ కలిగిన పెద్ద పెద్ద గేమ్ లను కాకుండా చిన్న చిన్న గేమ్ లను ఆడడానికి ఎంచుకోవడం అనేది కొసమెరుపు. ఫాంటసీ గేమింగ్: భారతదేశంలోని ప్రముఖ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన మొబైల్ ప్రీమియర్ లీగ్ తన ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ 2021ని ఇటీవల విడుదల చేసింది. ఇండియా యొక్క గేమింగ్ జాగ్రఫీకి సంబంధించిన డేటాను షేర్ చేసింది. షేర్ చేసిన నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో దేశంలో అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ గేమ్ లను ఆడుతున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీ వాసులున్నారు. అంతేకాకుండా మొదటి ఐదు జాబితాలో చోటు దక్కించుకున్న మెట్రో నగరం కూడా ఢిల్లీ కావడం మరొక ప్రత్యేకత. ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా జైపూర్, పూణె, లక్నో మరియు పాట్నా తర్వాతి స్థానాల్లో చోటును దక్కించుకున్నాయి."పుణె, లక్నో మరియు పాట్నా వంటి నగరాలలో నివసించే వారు 2021లో మొబైల్ గేమ్‌లను అధిక సంఖ్యలో ఆడుతున్న ఆటగాళ్ళను కలిగి ఉండడం గమనార్హం అది కూడా ముంబై, బెంగళూరు మరియు కోల్‌కతా వంటి పెద్ద నగరాలను వెనుకకు నెట్టి". ముంబై, బెంగళూరు మెట్రో నగరాలు ఆరు, ఏడో స్థానాల్లో నిలవగా కోల్‌కతా 12వ స్థానంలో నిలిచింది. క్యారమ్, ఫ్రూట్ డార్ట్, ఫ్రూట్ చాప్, రన్నర్ నంబర్ 1 మరియు బ్లాక్ పజిల్‌లు వంటి చిన్న చిన్న గేమ్ లు అగ్రస్థానంలో నిలిచాయి. చెస్ మరియు పూల్ కూడా దేశంలో గేమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
0 Comments