Ad Code

Surface Pro X విడుదల


మైక్రోసాఫ్ట్..Surface Pro X స్మార్ట్ టాబ్లెట్ ను భారత విఫణిలోకి విడుదల చేసింది. 13 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ గా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ పరికరానికి బ్లూటూత్ అనుసంధానంతో కీ బోర్డు జతచేసి లాప్ టాప్ గానూ ఉపయోగించుకోవచ్చు. భారత్ లో మొత్తం 3 వేరియంట్లలో లభ్యమౌతున్న ఈ Surface Pro X ప్రారంభ ధర రూ.93,999లుగా ఉండగా.. 8GB/128GB వేరియంట్ ధర రూ.94,599 గానూ.. 16GB/512GB వేరియంట్ ధర రూ.1,50,499 గానూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన Surface టాబ్లెట్ లలో ఇదే అత్యంత సన్నని టాబ్లెట్ గా మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సొంతంగా అభివృద్ధి చేసిన SQ1/SQ2 ప్రాసెసర్లతో వస్తున్న ఈ ట్యాబ్ లో అడ్రినో 685/690 గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇందులో 8GB లేదా 16GB LPDDR4x ర్యామ్, 512 SSD రామ్ ఉంది. 3:2 రేషియో కలిగిన 13 అంగుళాల తెర ఇందులో ఉంది. PixelSense సాంకేతికత కలిగిన ఈ ట్యాబ్ స్క్రీన్ రిజల్యూషన్ 2880 x 1920 pixelsగా ఉంది. 15 గంటల పాటు బ్యాటరీ బ్యాక్ అప్ ఉంటుంది. ఇక ఈ Surface Pro Xలో రెండు USB Type-C పోర్టులు, Bluetooth 5.0, Wi-Fi ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో Surface Slim Pen 2ని ఉచితంగా అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఓఎస్ తాజా వెర్షన్ విండోస్11తో వస్తున్న ఈ Surface Pro Xలో ముందు భాగంలో 5ఎంపీ HD కెమెరా, వెనుక 10ఎంపీ 4K కెమెరా ఉన్నాయి. స్పష్టమైన ఆడియో క్వాలిటీ కోసం 2W డాల్బీ స్పీకర్స్ ను ఇందులో అమర్చారు. భారత్ లో ఆన్ లైన్ లోనూ.. రిలయన్స్ డిజిటల్ స్టోర్లల్లోనూ ఈ Surface Pro X అందుబాటులో ఉన్నట్లు సంస్థా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu