కోటక్ మహీంద్రా బ్యాంక్ యాపిల్ ప్రొడక్ట్స్‌పై తన కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కేఎంబీఎల్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులు ఐఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, హోమ్‌పాడ్‌లపై రూ. 10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌లు పొందొచ్చు. అంతేకాదు యాపిల్ ప్రొడక్ట్స్‌పై ఈఎంఐ ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు.కోటక్ మహీంద్రా బ్యాంకు యాపిల్ ప్రొడక్ట్స్‌పై క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆఫర్స్ ప్రకటించింది. దీంతో ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్‌లు ఈఎంఐ/నాన్-ఈఎంఐ లావాదేవీలు ఉపయోగించి ఐఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, హోమ్‌పాడ్‌లపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ ఫోన్స్‌పై కేఎంబీఎల్ కార్డ్ హోల్డర్‌లు రూ.6,000 క్యాష్ బ్యాక్ లేదా ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ దక్కించుకోవచ్చు. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12 ఫోన్స్‌పై కస్టమర్‌లు ఏకంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. న్యూ మ్యాక్‌బుక్ ప్రో (New Macbook Pro)పై గరిష్టంగా రూ.10,000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది బ్యాంకు. ఇయర్ పాడ్‌లపై రూ.1,000 నుంచి రూ.2,500 వరకు ఆఫర్‌లు పొందొచ్చు. అలాగే యాపిల్ స్మార్ట్‌వాచ్‌లపై రూ.1,000 నుంచి రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను బ్యాంకు తీసుకొచ్చింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఛానెల్‌లలో ఫుల్ కార్డ్ స్వైప్‌లు కార్డ్ ఈఎంఐలపై రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయని కోటక్ బ్యాంక్ తెలిపింది. యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్స్, అమెజాన్, టాటా క్లిక్ వంటి ఈకామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఈ ఆఫర్‌లు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌లు జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. "యాపిల్ ప్రొడక్ట్స్‌పై మేం తీసుకొచ్చిన ఆఫర్ల సాయంతో కేఎంబీఎల్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులు యాపిల్ ఉత్పత్తులను సులభమైన, సరసమైన ఈఎంఐలలో సొంతం చేసుకుంటారు. యాపిల్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌లు గరిష్టంగా డబ్బులు ఆదా చేసుకునేందుకు మా కస్టమర్లకు సహాయపడతాయి. దీనితో, మా కస్టమర్‌లు 2022 నూతన సంవత్సరానికి సూపర్ స్టార్ట్‌ని ఆనందిస్తారని మేం ఆశిస్తున్నాం!" అని కోటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ ప్రెసిడెంట్ - కన్స్యూమర్, కమర్షియల్, వెల్త్ మార్కెటింగ్ ఎలిజబెత్ వెంకటరామన్ అన్నారు.
యాపిల్ ప్రొడక్ట్స్‌పై కోటక్ మహీంద్రా బ్యాంకు క్యాష్‌బ్యాక్ ఆఫర్!
Monday, January 17, 2022
apple science technologe అమెజాన్ ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్స్ టాటా క్లిక్ వంటి ఈకామర్స్ వెబ్సైట్ యాపిల్ ప్రొడక్ట్స్‌పై కోటక్ మహీంద్రా బ్యాంకు క్యాష్‌బ్యాక్ ఆఫర్!
No comments:
Post a Comment