మైక్రోమ్యాక్స్ తన సరికొత్త మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన తాజా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ మరియు AMOLED డిస్‌ప్లేతో పాటు కొత్త, మరింత ప్రీమియం లుక్‌తో వచ్చింది. జనవరి 30 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 భారతదేశంలో రూ. 13,490 ధరతో లభిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, కంపెనీ రూ. 1,000 తగ్గింపును ప్రవేశపెట్టింది. మొదటగా కొనుగోలు చేసేవారు రూ. 12,490కే స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. స్టాక్స్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది. Flipkart, Micromax అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పవర్ చేయబడింది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2, శామ్సంగ్ లాంటి కెమెరా మాడ్యూల్ డిజైన్‌లో ఉంచబడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. కెమెరా మాడ్యూల్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, రెండు 2-మెగాపిక్సెల్ లెన్స్‌లు ఉన్నాయి. ముందు, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్‌తో వస్తుంది.
0 Comments