ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఫీచర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఎప్పుడో భర్తీ చేసేశాయి. దీంతో ఇంటర్నెట్తో కూడిన ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అనివార్యంగా మారిపోయింది. జియో రోజూ 2.5జీబీ డేటాతో యాన్యువల్ ప్లాన్‌ను లేటెస్ట్గా తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి రూ.3,119, రూ.2,879 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్న సంగతి తెలిసింది. ఇప్పుడు రూ.2,999 ధరతో మరో యాన్యువల్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన యూజర్లు రోజూ 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. జియో రూ.2,999 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభించదు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే రూ.3,119 యాన్యువల్ ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. జియో రూ.3,119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 740జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితం. జియో ఇటీవల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. జియోలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ అందించే ప్లాన్స్‌లో రూ.499 ప్లాన్‌తో పాటు రూ.601, రూ.799, రూ.1066, రూ.3,119 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నింటికీ రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు రూ.659 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84జీబీ లభిస్తుంది. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. కానీ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. జియో పోస్ట్‌పెయిడ్‌లో రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 ప్లాన్స్ తీసుకున్నవారికి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
జియో నుంచి కొత్త యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్!
by Telugu Lo Computer at January 18, 2022About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment