'మిస్టర్‌ ప్రేమికుడు'


ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం 'చార్లీ చాప్లిన్‌ 2'. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్‌.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి 'మిస్టర్‌ ప్రేమికుడు' పేరుతో తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి మాట్లాడుతూ.. ''పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్‌తో పాటు అదా శర్మ, నిక్కీ గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ప్రభుదేవా తరహా హాస్యంతో పాటు ఆయన డ్యా¯Œ ్సని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూస్తారు'' అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org