పర్వతాన్ని అధిరోహించిన నటి నివేదా థామస్

 

తెలుగులోనూ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ భామ నివేదా థామస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా, దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన కల నెరవేర్చుకుంది. నివేదా అభిరుచుల్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. కాగా, కిలిమంజారోను అధిరోహించినప్పటి ఫొటోలను నివేదా సోషల్ మీడియాలో పంచుకుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org