దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది. కంపెనీ 4G స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్‌ను మార్కెట్లోకి తీసుకుని రాబోతుంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. చాలా తక్కువ ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.3499గా ఉంటుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. గూగుల్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. ఆండ్రాయిడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, కెమెరా ఫిల్టర్‌లతో పాటు ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన జియో యాప్‌లు ఉండనున్నాయి. జూన్24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందించబోతున్నట్లు ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందించారు. దేశంలోని 30కోట్ల 2జీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4G వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.
0 Comments