Ad Code

షుగర్, రక్తపోటుకి చెక్ - దాల్చిన చెక్క టీ

 


వంటింటి పోపుల పెట్టెలో ఉండే ఓ మసాలా దినుసు దాల్చినచెక్క. అతిపురాతన మైన ఈ మసాల దినుసు ఇది మంచి సువాసననిస్తుంది. ఒక గ్లాసు నీటిలో చిటికెడు దాల్చిన చెక్కపొడిని కలిపితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ , బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ అని కూడా పిలువబడే దాల్చిన చెక్క నీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క, ముఖ్యంగా సిలోన్ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక ఔషధ ప్రయోజనాలను ఇస్తుంది. అందుకనే తినే ఆహారంలో మసాలా దినుసులను పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క నీరు రెగ్యులర్ గా తాగడం వలన శరీరంలోని అదనపు షుగర్ ను బయటకు పంపుతుంది. అంతేకాదు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యాగజైన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. రోజుకు 1 గ్రాము దాల్చిన చెక్కను రెగ్యులర్ గా తినే ఆహారంలో చేర్చుకోవడం టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. దాల్చినచెక్కలోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంతోపాటు నిర్వహించడంలో సహాయపడతాయి. వాస్తవానికి దాల్చిన చెక్క జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపి నిద్రలేమిని దూరం చేస్తుంది. దాల్చిన చెక్క టీ తయారీకి ముందుగా ఒక గ్లాస్ కంటైనర్‌లో ఒక లీటరు నీటిని తీసుకోవాలి. తర్వాత అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిలో 2-3 నిమ్మకాయ ముక్కలను జోడించండి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి.. మర్నాడు ఈ దాల్చిన చెక్క టీ తాగాలి.

Post a Comment

0 Comments

Close Menu