జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కొత్తగా ఒక మల్టీ పర్పస్ కారును తీసుకొచ్చింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌ను టయోటా ఇండియా తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో ఇది అందుబాటులోకి వచ్చింది.లిమిటెడ్ ఎడిషన్ గా విడుదలైన ఇన్నోవా క్రిస్టా స్టాక్.. స్టాక్ అయిపోయేంత వరకు మార్కెట్లోనే ఉండనుంది. కాంప్లిమెంటరీ ప్యాకేజీ ధర సాధారణ ఎక్స్-షోరూమ్ ధర కంటే కాస్త ఎక్కువగా ఉండనుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.18 లక్షలు.. డీజిల్ వెర్షన్ ధర రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు.
ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ప్యాక్‌లో 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, 16 రంగులతో ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు తదితర ఫీచర్స్ అందించారు. టయోటా కారులో పైన పేర్కొన్న ఫీచర్లను పరిమిత ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ అవి యాక్సెసరీలుగా డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. టయోటా ఇన్నోవా క్రిస్టా కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథరెట్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ కారు వేరియంట్లు 2.4 లీటర్ డీజిల్, 2.7 లీటర్ పెట్రోల్ మోటార్‌ని కలిగి ఉంటాయి. డీజిల్ కారు 150బీహెచ్పీ, 360Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ కారు 166బీహెచ్పీ, 245Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. రెండు ఇంజన్లు ఐదు-స్పీడ్ మాన్యువల్, ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. భద్రత కోసం ఇన్నోవా క్రిస్టాలో ఏడు ఎస్ఆర్ఎస్ (SRS) ఎయిర్ బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎకో & పవర్ డ్రైవ్ మోడ్‌లు క్రూయిజ్ కంట్రోల్ అందించారు.
0 Comments