జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌


బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ, అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్‌ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‌ను విడుదల చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org