Ad Code

బూస్టర్‌ డోసు అవసరం ఉండొచ్చు:రణ్‌దీప్‌

 

దేశంలో వచ్చే సంవత్సరం నాటికి బూస్టర్‌ డోసు అవసరం ఉండొచ్చిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరస్‌ ఉత్పరివర్తనం చెందితే బూస్టర్‌ డోసు తప్పనిసరి అవుతుందన్నారు. దేశంలో బూస్టర్‌ డోసుల పంపిణీపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌దీప్‌ గులేరియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ మొదటి రెండు డోసులు సమర్థవంతంగా ఎన్ని రోజులు పని చేస్తాయన్న అంశంపై.. బూస్టర్‌ డోస్‌ ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ బూస్టర్‌ డోసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, యాంటీబాడీలను ఆధారం చేసుకొని బూస్టర్‌ డోసు ఇవ్వలేం, అది కాలం మీద ఆధారపడి ఉంటుంది. రెండో సారి వ్యాక్సిన్‌ తీసుకున్న సంవత్సరం తర్వాత బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాలి, కానీ దీనిపై మరింత సమాచారం అవసరం అన్నారు. మూడో డోసు పంపిణీపై చర్యలు కొనసాగుతున్నాయని రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రభుత్వం వచ్చే సంవత్సరం నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu