Ad Code

గూగుల్ మీట్‌లో కొత్త ఫీచర్


గూగుల్ మీట్‌ లో కొత్త ఫీచర్ వచ్చింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మీటింగ్స్‌, ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువగా గూగుల్ మీట్‌నే వాడుతున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతుండటంతో గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. ఇదివరకు మీటింగ్ స్టార్ట్ అయ్యాక హోస్ట్‌కు ఇతర పార్టిసిపెంట్స్ మైక్స్ 'ఆఫ్' చేసే ఆప్షన్ లేదు. కొందరు పార్టిసిపెంట్స్ మాట్లాడటం పూర్తయ్యాక.. తమ మైక్‌ను ఆఫ్ చేయకపోయినా.. మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ఉండవు. మీటింగ్‌లో ఉన్న అందరు పార్టిసిపెంట్స్‌ను ఒకేసారి మ్యూట్ చేసే ఆప్షన్ హోస్ట్‌కు ఉంటుంది. పార్టిసిపెంట్స్ మాట్లాడాలని అనుకున్నప్పుడు మాత్రమే హోస్ట్ మ్యూట్ ఆప్షన్‌ను తీసేయవచ్చు. ఈ ఫీచర్‌ను గూగుల్ వర్క్‌స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్లస్ డొమైన్స్‌లో తీసుకురానున్నారు. గూగుల్ వర్క్‌స్పేస్ ఎడిషన్స్‌లో త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. "మ్యూట్ ఆల్ అనే ఫీచర్ కేవలం మీటింగ్ హోస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకసారి పార్టిసిపెంట్స్‌ను మ్యూట్ చేశాక.. మళ్లీ వాళ్లను అన్‌మ్యూట్ చేయడం కుదరదు. ఒకవేళ పార్టిసిపెంట్స్ కావాలనుకుంటే అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి గూగుల్ మీట్‌ను యాక్సెస్ చేసుకున్న హోస్ట్‌కు మాత్రమే మ్యూట్ ఆల్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తాం.." అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. యూజర్లు మ్యూట్ చేయాలనుకుంటే యూజర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మ్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ హోస్ట్‌లకు డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఈ ఫీచర్‌ను గూగుల్ వర్క్‌స్పేస్ ఎసెన్షియల్స్‌, బిజినెస్ స్టార్టర్‌, బిజినెస్ స్టాండర్డ్‌, బిజినెస్ ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్ ఎసెస్షియల్స్‌, ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్‌, ఎంటర్‌ప్రైజ్ ప్లస్‌, జీ సూట్ బేసిక్ బిజినెస్‌, నాన్ ప్రాఫిట్స్ కస్టమర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని గూగుల్ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu