గీతాంజలి 1960వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నటి. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది. గీతాంజలి 1947లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించింది. నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది. సహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరింది. గీతాంజలి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 31 ఉదయం 4 గంటలకు మరణించారు.
0 Comments