ప్రపంచంలోనే అత్యంత చవకైనా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారి కోసం జియోఫోన్ నెక్స్‌ట్ వచ్చేసింది. రిలయన్స్ జియో, గూగుల్ సంయుక్తంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడం విశేషం. కేవలం రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కేవలం రూ.300 నుంచే ప్రారంభం అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేవారికి డేటా, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బెనిఫిట్స్ మారుతుంటాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఎనిమిది రకాల ఈఎంఐ ఆప్షన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.300 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.350 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి నెలకు 5జీబీ డేటా + 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి, లార్జ్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.450 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.500 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.500 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.550 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.550 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.600 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇలా ఈఎంఐ ఆప్షన్‌తో రావడం ఇదే మొదటిసారి. ఇందులో ఏ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ముందు రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించాలి. రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియోమార్ట్ డిజిటల్ నెట్వర్క్‌లో 30,000 పైగా రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కొనడానికి రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్‌లో రిజిస్టర్ చేయొచ్చు. వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కలెక్ట్ చేసుకోవచ్చు.
0 Comments