మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడమ కాయ తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తింటే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు. పొలాల్లో పని చేసే వారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఈ కాయలలోనే కాకుండా ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
0 Comments