కరోనా వైరస్ బూస్టర్ డోసులు ఇచ్చే ముందు దేశ జనాభా అంతటికీ ముందుగా పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ పేర్కొన్నారు. భారత జనాభాకు బూస్టర్ డోసులపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ సూచించినా భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సిన్ రెండు డోసులూ జనాభా అంతటికీ అందుబాటులోకి తీసుకురావడం పైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టిసారించాల్సిన పరిస్ధితి ఉందని ఐసీఎంఆర్ చీఫ్ స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు ఈ నెలాఖరు నాటికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారులకు కొవిడ్-19 వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుందని బలరాం భార్గవ తెలిపారు. దేశ జనాభా అంతటికీ రెండు డోసుల కరోనా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు.
0 Comments