ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ !


ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్'. ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్లలో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. 'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్' పేరుతో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే 'బెయోన్స్ అండ్ జే జెడ్' ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం.ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ లభించకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. డిజైన్ మాత్రం చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి లభిస్తాయి.  https://t.me/offerbazaramzon

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org