స్టీవ్ జాబ్స్ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ప్రవేశపెట్టడం ద్వారా స్మార్ట్‌ఫోన్లలో విప్లవాత్మక ప్రస్ధానానికి తెరతీశారు. టచ్‌స్క్రీన్, మ్యూజిక్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఎన్నో ఫీచర్లతో మొబైల్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారింది. అందుకే ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ ఫోన్‌కు అంతటి ప్రత్యేకత. ఇక ఫ్యాక్టరీ సీల్డ్ ఒరిజినల్ ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరు. సీల్ తీయని ఐఫోన్లు వేలంలో రూ. లక్షలు పలకడం చూశాం. ఇక ఇటీవలి వేలంలో ఐఫోన్ తొలి జనరేషన్ డివైజ్ అత్యధిక విలువ కలిగిన ఐఫోన్‌గా నిలిచింది. తొలి జనరేషన్ 4జీబీ వెర్షన్ ఐఫోన్ ఎల్‌సీజీ వేలంలో ఏకంగా రూ. 1.3 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. ఈ అరుదైన 4జీబీ మోడల్‌కు జూన్ 30న పదివేల డాలర్లతో బిడ్డింగ్ మొదలైంది. ఆపై అత్యధిక డిమాండ్‌తో కొద్దిరోజుల్లోనే ధర పెరుగుతూ గత రికార్డు రూ. 51.6 లక్షలను అధిగమించింది. 2007లో లాంఛ్ అయిన ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ ధర దాదాపు రూ. 40,000గా ఉంది. ఇటీవలి వేలంతో గత 16 ఏండ్లలో 4జీబీ వేరియంట్ విలువ ఏకంగా 318 రెట్లు పెరగడం గమనార్హం. ఇక బాక్స్ ఓపెన్ చేయని ఒరిజినల్ ఐఫోన్ మోడల్ 4జీబీ వేరియంట్ ఫ్యాక్టరీ సీల్‌తో చెక్కుచెదరకుండా ఉంది. అద్భుతమైన కలర్, గ్లాస్‌తో పాటు ఎన్నడూ యాక్టివేట్ చేయని బ్రాండ్ న్యూ మోడల్ అని వేలం నిర్వాహకులు చెప్పారు. https://t.me/offerbazaramzon
0 Comments