Ad Code

స్కాన్ అవసరం లేకుండానే వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ ?


వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ అయ్యేందుకు QR కోడ్‌ స్కానర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే QR కోడ్‌ అవసరం లేకుండా వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ అయ్యేందుకు మరో ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo వెల్లడించింది. లింక్‌ విత్ ఫోన్‌ నంబర్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫీచర్‌ ద్వారా QR కోడ్‌ స్కానర్‌ అవసరం లేకుండా మొబైల్‌ నంబర్‌తోనే వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ కావచ్చని తెలిపింది. ఇందుకు OTP (వన్‌ టైం పాస్‌వర్డ్‌) అవసరం అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని WABetainfo వెల్లడించింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ వెబ్‌ను ఓపెన్‌ చేయాలి. లింక్‌ విత్‌ ఫోన్‌ నంబర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అక్కడ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత 8 అంకెల ఓటీపీని ఎంటర్‌ చేయాలి. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటాలో కొందరికి అందుబాటులో ఉందని, రానున్న రోజుల్లో వినియోగదారులు అందరికీ విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌లోనికి వాట్సాప్‌ చాట్‌ డేటాను బదిలీ చేసుకొనేందుకు కీలక ఫీచర్‌ను విడుదల చేసింది. QR కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా చాట్‌ను బదిలీ చేసుకోవచ్చు. అయితే వినియోగదారుడి పాత, కొత్త ఫోన్లు ఒకే రకమైన OSను కలిగి ఉండాల్సి ఉంటుంది. మరియు ఒకే వైఫైకి కనెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. QR కోడ్‌ విధానంలో చాట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకొనేందుకు వాట్సాప్‌ వినియోగదారుడు తన పాత ఫోన్ వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం చాట్‌పైన క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించిన ట్రాన్స్‌ఫర్‌ చాట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ QR స్కానర్‌ కనిపిస్తుంది. వినియోగదారుడు తన కొత్త ఫోన్‌ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ QR కోడ్‌ విధానం ద్వారా చాలా సులభంగా పాత ఫోన్‌ చాట్‌ డేటాను బదిలీ చేసుకోవచ్చని వాట్సాప్ స్పష్టం చేసింది. కేవలం రెండు ఫోన్ల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్‌ కావడం వల్ల ఇందులో ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తవని పేర్కొంది. థర్డ్‌ పార్టీ యాప్‌ల కంటే ఈ విధానం ఎంతో భద్రతను కలిగి ఉంటుందని వాట్సాప్‌ వెల్లడించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu