తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఈవీ తయారీ కంపెనీ టీఐ క్లీన్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను మార్కెట్లో అందుబాటులో ఉంచింది. మురుగప్ప గ్రూప్‌కు చెందిన కంపెనీయే ఇది. మోంత్రా ఎలక్ట్రిక్ త్రివీలర్ తీసుకువచ్చింది. మొంత్రా ఎలక్ట్రిక్ బ్రాండ కింద ఎలక్ట్రిక్ ఆటో కొనొచ్చు. స్మార్ట్ డిజైన్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో కంపెనీ ఈ ఆటోను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏకంగా 160 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. ఇది 4 సెకన్లలోనే 0 నుంచి 20 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 10 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. దీని టార్క్ 60 ఎన్ఎం. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. 4 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇందులో బొరొన్ స్టీల్ ఛాసిస్, ఫుల్ మెటల్ బాడీ, రెక్సిన్ కనోపీ రూఫ్ వంటి ఫీచర్ల్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 207 ఎంఎం. వెడల్పు 1350 ఎంఎం, పొడవు 2825 ఎంఎం. ఎత్తు 1750 ఎంఎం. ఈ ఎలక్ట్రిక్ ఆటో మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. బేస్ మోడల్ ఇపీపీ, మిడ్ వేరియంట్ ఇపీవీ2.0, టాప్ వేరియంగ్ ఇపీఎక్స్ అనేవి ఇవి. ఈ ఆటో 770 కేజీల వరకు బరువును లాగగలదు. ఇంకా ఇందులో ఎల్ఈడీ లైట్స్, యాప్ కనెక్టివిటీ, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, మొబైల్ చార్జింగ్, గ్లోవ్ బాక్స్, రియర్ లగేజ్ క్యాబిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ మోడ్ సహా ఎకో, పవర్, డ్రైవ్ అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. https://t.me/offerbazaramzon
0 Comments