Ad Code

వచ్చేనెల 'వన్ ప్లస్ ఓపెన్' విడుదల !


వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 'వన్ ప్లస్ ఓపెన్' వచ్చేనెలలో మార్కెట్లోకి రానున్నది. గత ఫిబ్రవరిలో తొలిసారి తన ఫోల్డబుల్ ఫోన్ గురించి 'క్లౌడ్11' లాంచింగ్ సందర్భంగా వన్ ప్లస్ వెల్లడించింది. వన్ ప్లస్ ఓపెన్ పేరిట రూపుదిద్దుకుంటున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వచ్చేనెల 29న మార్కెట్లో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. వన్ ప్లస్ వీ ఫోల్డ్ లేదా వన్ ప్లస్ ఓపెన్ అనే పేరుతో వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వెలువడే అవకాశం ఉంది. చైనాతోపాటు భారత్, అమెరికా మార్కెట్లలోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. అయితే, దీని ధర ఎంత అన్న సంగతి ఇంకా వన్ ప్లస్ వెల్లడించలేదు. వన్ ప్లస్ ఓపెన్ 7.8-అంగుళాల 2కే అమోలెడ్ ఇన్నర్ స్క్రీన్, 6.3-అంగుళాల అమోలెడ్ ఔటర్ డిస్ ప్లే అండ్ బాట్ విత్ 120 హెర్జ్ట్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు. 16జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‬గా అందుబాటులో ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 48-మెగా పిక్సెల్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ పెరిస్కోప్ లెన్స్ @ రేర్ ప్యానెల్ పై ఉంటాయి. సెల్ఫీల కోసం రెండు 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్లు ఉంటాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu