Ad Code

ట్విట్టర్ లో పిట్ట మాయం కానున్నదా ?


ప్ర
ముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లోగోనుంచి పక్షి మాయమవుతుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ట్విట్టర్‌కు ఆ పక్షి లోగో ప్రధాన చిహ్నంగా ఉన్న సంగతి తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని మస్క్ ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ట్విట్టర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన' ఎక్స్‌కార్ప్'లో విలీనం చేయనున్నట్లు కొన్నాళ్ల క్రితం మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.' త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం.” అని ఎలాన్‌ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే ట్విట్టర్ పక్షి కనుమరుగవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత లోగో, బ్లూ బర్డ్ తమ గుర్తింపు అసెట్ అని, అందుకే దీనిని మేము కాపాడుకుంటామని ట్విట్టర్ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా 'ఎక్స్' పేరు విషయం కొంతకాలంగా ఎలాన్ మస్క్ మనసులో ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా ఎలాన్ మస్క్ గతేడాది ఏకంగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఎక్స్ కార్ప్ కంపెనీలో దీనిని విలీనం చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత యజమాని ఎలాన్‌ మస్క్ దానిపై అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ట్విట్టర్‌కి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా బాగా పాపులరిటీ తెచ్చిపెట్టిన లోగోనే మార్చాలని నిర్ణయించారు. ముఖ్యంగా సింబాలిక్‌గా ఉన్న పిట్ట బొమ్మను తొలగించి దాని స్థానంలో ఎక్స్ అనే అక్షరాన్ని చేర్చుతున్నట్లుగా ప్రకటించారు. ‘ఈ రాత్రి పోస్టు చేసిన 'x' లోగో బాగుంటే రేపటినుంచే అది అమలులోకి వస్తుంది'అని మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ ట్విట్టర్‌ను గత ఏడాది కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద మార్పు ఇదేనని చెప్పవచ్చు. మస్క్‌కు 'x' అక్షరం చాలా ఇష్టం. ఈ విషయం కొత్తేమీ కాదు.ట్విట్టర్ సీఈవోగా లిండా యాకరీనో బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడాకంపెనీని ఎవ్రీథింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని మస్క్‌ ట్వీట్ చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu