Ad Code

లెనోవో డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విడుదల


లెనోవో యోగో బుక్ 9i ల్యాప్‌టాప్ ను హాంగ్‌కాంగ్-హెడ్‌క్వార్టర్డ్ కంపెనీ లేటెస్ట్ డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రిలీజ్ చేసింది. 2.8K రిజల్యూషన్‌తో 13.3-అంగుళాల OLED టచ్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. లెనోవో యోగా బుక్ 9i ఇంటెల్ Evo ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. Wi-Fi 6E, థండర్‌బోల్ట్ 4తో సహా లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చింది. ఫోలియో స్టాండ్, సపరేటు బ్లూటూత్ కీబోర్డ్ వంటి విభిన్న అప్లియన్సెస్‌తో వస్తుంది. యోగా బుక్ 9i నాలుగు-సెల్ 80Whr బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. దేశీయ మార్కెట్లో లెనోవో యోగోబుక్ 9i ప్రారంభ ధర రూ. 2,24,999గా ఉంది. ల్యాప్‌టాప్ టైడల్ టీల్ షేడ్‌లో వస్తుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. లెనోవో రూ. 10వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. అలాగే, కొనుగోలుదారులు రూ. 10వేల వరకు ప్రొడక్టు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. కొత్త మోడల్‌తో పాత ల్యాప్‌టాప్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. లెనోవో యోగాబుక్ 9i మోడల్ CES 2023 సమయంలో 2,099.99 డాలర్లు (దాదాపు రూ. 1,75,000) ప్రారంభ ధరతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు OLED డిస్ప్లేలు సెంట్రల్ కీలుతో వచ్చాయి. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ 5 వేళ్ల కదలికతో ఏకకాలంలో మల్టీ టాస్క్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Windows 11లో రన్ అవుతుంది. 60Hz రిఫ్రెష్ రేట్, HDR సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో రెండు 13.3-అంగుళాల 2.8K OLED ప్యూర్‌సైట్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. DCI-P3 కలర్ గామెట్, 16:10 అస్పెక్ట్ రేషియో 100 శాతం కవరేజీతో డిస్ప్లేలు, ల్యాప్‌టాప్, టాబ్లెట్ మోడ్‌ల మధ్య మారడానికి యూజర్లను అనుమతించే ఫోలియో స్టాండ్‌తో వచ్చాయి. 13వ Gen Intel కోర్ i7 ప్రాసెసర్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ Intel Iris Xe గ్రాఫిక్స్‌తో రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5x RAMని ప్యాక్ చేస్తుంది. 1TB వరకు PCIe SSD స్టోరేజీని పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు 2W స్పీకర్లు, రెండు 1W బోవర్‌లు, డాల్బీ అట్మోస్ ఆడియోతో విల్కిన్స్ స్పీకర్‌లు ఉన్నాయి. ఇంకా, ల్యాప్‌టాప్ ప్రైవసీ షట్టర్‌తో ఫుల్-HD IR RGB వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. డ్యూయల్ స్క్రీన్ వినియోగంతో గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఒకే డిస్‌ప్లేను ఉపయోగిస్తే.. గరిష్టంగా 14 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. https://t.me/offerbazaramzon


Post a Comment

0 Comments

Close Menu