Ad Code

యాడ్స్‌పై నెలకు 1,000 డాలర్లు ఖర్చు చేస్తేనే గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ !


ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే ఎలన్ మస్క్ ఉన్నాడు. ట్విట్టర్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని కూడా అసలు వదలుకోవడం లేదు. రెండు నెలల క్రితమే తన ప్రకటనదారులు చాలా మంది ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారని మస్క్ వెల్లడించారు. అన్ని ఆందోళనకరమైన విషయాలను పరిష్కరించినట్టు మస్క్ చెప్పాడు. ట్విట్టర్ కొత్త సీఈఓగా మార్కెట్‌లో అగ్ర అడ్వర్టైజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ అయిన లిండా యాకారినోను నియమించుకున్న సంగతి తెలిసిందే. మస్క్ హయాంలో ట్విట్టర్ ప్రకటనల వ్యాపారం భారీగా దెబ్బతింది. ఇప్పుడు యాడ్స్ బిజినెస్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవలి నివేదికల ప్రకారం ట్విట్టర్ యాడ్స్ కోసం నెలకు కనీసం 1,000 డాలర్లు (రూ. 81వేలు) ఖర్చు చేయాల్సిందిగా బ్రాండ్ అకౌంట్లను మస్క్ ప్రలోభపెట్టాలని భావిస్తున్నాడు. లేదంటే బ్రాండ్ ట్విట్టర్ అకౌంట్లలో గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం ట్విట్టర్ ప్లాట్‌ఫారం ఆగస్ట్ 7 నుంచి ప్రకటనల వ్యాపారాభివృద్ధికి కనీసం 60 రోజుల్లో యాడ్స్ కోసం 1,000 డాలర్లు (దాదాపు రూ. 81వేలు) లేదా 180 రోజుల్లో 6వేల డాలర్లు (రూ. 800.9 లక్షలు) ఖర్చు చేయకపోతే గోల్డ్ చెక్‌మార్క్‌ను తొలగిస్తుంది. దీనికి సంబంధించి ఇమెయిల్ ద్వారా ట్విట్టర్ పలు బ్రాండ్‌లకు తెలియజేస్తోంది. ట్విట్టర్ కొత్త రీబ్రాండ్ (X) లోగోకు మార్చిన సందర్భంగా కొన్ని యాడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. బ్రాండ్ అకౌంటుదారులు తమ గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్‌లో ఉంచడానికి ఇప్పటికే నెలవారీ 1,000 డాలర్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరిలోనే కొత్త ట్విట్టర్ వెరిఫికేషన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu